Ram Lalla: అత్తారింటి నుంచి అయోధ్య రామయ్యకు వెండివిల్లు సహా 3 వేలకుపైగా కానుకలు

  • సీతాదేవి జన్మించిన నేపాల్‌లోని జనక్‌పూర్ నుంచి 30 వాహనాల్లో వచ్చిన భక్తులు
  • బహుమతులను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు అందించిన రామ్‌జానకి ఆలయ పూజారి
  • బహుమతుల్లో వెండి పాదరక్షలు, ఇతర బంగారు, వెండి ఆభరణాలు
More than 3000 gifts including silver bow to lord Sri Ram from In laws place

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి శరవేగంగా పనులు జరుగుతున్న వేళ రామయ్యకు అత్తారింటి నుంచి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. సీతాదేవి జన్మించిన నేపాల్‌లోని జనక్‌పూర్ నుంచి 3 వేలకు పైగా బహుమానాలు అయోధ్యకు చేరుకున్నాయి. వీటిలో వెండి పాదరక్షలు, ఆభరణాలు, దుస్తులు, వెండివిల్లు వంటివి ఉన్నాయి. 

జనక్‌పూర్‌లోని రామ్‌జానకి ఆలయ పూజారి రామ్ రోషన్‌దాస్ వీటిని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అందించారు. 800 మంది భక్తులు 500 డబ్బాల్లో 30 వాహనాల్లో కాన్వాయ్‌గా ఈ బహుమతులను తీసుకొచ్చారు. వీటిలో పండ్లు, స్వీట్లు, బంగారు, వెండి వస్తువులు, డ్రైఫ్రూట్స్, నేపాల్ సంప్రదాయ మిఠాయిలు వంటివి ఉన్నాయి.

More Telugu News