Devara: 'దేవర'లో హీరో - విలన్ పోరాటం .. కోట్ల ఖర్చుతో భారీ సెట్!

  • 'దేవర' కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిటింగ్ 
  • ఉత్కంఠను పెంచుతున్న అప్ డేట్స్ 
  • హైలైట్ గా నిలవనున్న యాక్షన్ సీన్స్ 
  • ప్రత్యేక ఆకర్షణగా అనిరుధ్ సంగీతం

Devara Movie Update

'దేవర' .. టైటిల్ వినగానే ఎన్టీఆర్ అభిమానులు చాలా పవర్ ఫుల్ గా ఉందని అనుకున్నారు. ఆ తరువాత ఎన్టీఆర్ లుక్ కూడా అంతే పవర్ ఫుల్ గా బయటికి వచ్చింది. ఆ తరువాత నుంచి వస్తున్న అప్ డేట్స్ ఈ సినిమాపై అందరిలో ఆసక్తినీ .. అంచనాలను పెంచుతూ వెళుతున్నాయి. 300 కోట్ల రూపాయలకి పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి వదిలిన గ్లింప్స్ తో, యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో ఉండనున్నాయనే విషయం అర్థమవుతోంది. ప్రేక్షకుల అంచనాలను అందుకునేలానే ఈ సినిమా టీమ్ పనిచేస్తుందని అంటున్నారు. మరిన్ని యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించడానికి టీమ్ రెడీ అవుతోందని చెబుతున్నారు. 

ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ ను హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేయనున్నారు. హీరో - విలన్ తలపడే ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం ఇక్కడ భారీ సెట్ ను వేస్తున్నారట. అందుకోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు చేస్తున్నారని టాక్. ఎన్టీఆర్ జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ సినిమాకి, అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

More Telugu News