Peethala Sujatha: అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం పిరికిపంద చర్య: పీతల సుజాత

Peethala Sujatha extends solidarity towards Anganwadi workers
  • ఏపీలో 28 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు
  • అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించిన ప్రభుత్వం
  • తాము అంగన్వాడీలకు రెండుసార్లు జీతాలు పెంచామన్న పీతల సుజాత
  • టీడీపీ ప్రభుత్వం వచ్చాక అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తుందని హామీ
ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయ సిబ్బంది తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ 28 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినప్పటికీ అంగన్వాడీలు బెదిరేది లేదంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. అంగన్వాడీలకు విపక్షాలు మద్దతు ఇస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో, టీడీపీ నేత, మాజీ మంత్రి పీతల సుజాత ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడాన్ని తప్పుబట్టారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని అడుగుతున్న అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం పిరికిపంద చర్య అని మండిపడ్డారు. 

భీమవరంలో పీతల సుజాత ఇవాళ అంగన్వాడీలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, టీడీపీ హయాంలో అంగన్వాడీలకు రెండు సార్లు జీతాలు పెంచామని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం వచ్చాక అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
Peethala Sujatha
Anganwadi Workers
Strike
ESMA
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News