బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో 1,50,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన క్రికెటర్ షకీబ్ అల్ హసన్
- మగురా-1 పార్లమెంట్ సీటు నుంచి గెలిచిన బంగ్లా క్రికెట్ టీమ్ కెప్టెన్
- ప్రధాని షేక్ హసీనా సారధ్యంలోని అవామీ లీగ్ పార్టీ తరుపున ఎన్నికల బరిలోకి దిగిన క్రికెటర్
- ఎన్నికల ప్రచారం కోసం క్రికెట్ నుంచి తాత్కాలిక విరామం తీసుకున్న షకీబ్
ఇదిలావుంచితే బంగ్లాదేశ్ పార్లమెంట్‌కు ఆదివారం (జనవరి 7) ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం కౌంటింగ్ మొదలైంది. ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ ఘనవిజయం సాధించింది. దీంతో షేక్ హసీనా ఐదవసారి బంగ్లా ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. పార్లమెంటులోని 300 సీట్లలో అధికారానికి కావాల్సిన స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. దీంతో అవామీ లీగ్ పార్టీ గెలిచినట్టుగా బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం ప్రకటించింది. లెక్కింపు ఇంకా పూర్తి కానప్పటికీ ఇప్పటికే గెలిచిన సీట్ల ప్రకారం అవామీ లీగ్ విజయం సాధించిందని బంగ్లా అధికార మీడియా తెలిపింది.