Shakib Al Hasan: బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో 1,50,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన క్రికెటర్ షకీబ్ అల్ హసన్

  • మగురా-1 పార్లమెంట్ సీటు నుంచి గెలిచిన బంగ్లా క్రికెట్ టీమ్ కెప్టెన్
  • ప్రధాని షేక్ హసీనా సారధ్యంలోని అవామీ లీగ్ పార్టీ తరుపున ఎన్నికల బరిలోకి దిగిన క్రికెటర్
  • ఎన్నికల ప్రచారం కోసం క్రికెట్‌ నుంచి తాత్కాలిక విరామం తీసుకున్న షకీబ్  
Cricketer Shakib Al Hasan has won in the Bangladesh election with huge majority

రాజకీయ నాయకుడిగా మారిన బంగ్లాదేశ్ క్రికెటర్, కెప్టెన్ షకీబ్ అల్ హసన్ తొలి విజయాన్ని అందుకున్నాడు. బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో అవామీ లీగ్ పార్టీ తరపున పోటీ చేసి, మగురా-1 సీటు నుంచి పోటీ చేసి 1,50,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచాడు. తన సమీప ప్రత్యర్థి కాజీ రెజాల్ హుస్సేన్‌కి 45,993 ఓట్లు మాత్రమే పడడం గమనార్హం. కాగా ఎన్నికల ప్రచారం కోసం షకీబ్ ఉల్ హసన్‌ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. కాగా షకీబ్ చివరిసారిగా వన్డే ప్రపంచ కప్ 2023లో ఆడాడు. బంగ్లా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. వరల్డ్ కప్ తర్వాత బంగ్లాదేశ్ - న్యూజిలాండ్ తలపడ్డప్పటికీ షకీబ్ అల్ హసన్ ఆడలేదు.

ఇదిలావుంచితే బంగ్లాదేశ్ పార్లమెంట్‌కు ఆదివారం (జనవరి 7) ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం కౌంటింగ్ మొదలైంది. ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ పార్టీ ఘనవిజయం సాధించింది. దీంతో షేక్ హసీనా ఐదవసారి బంగ్లా ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. పార్లమెంటులోని 300 సీట్లలో అధికారానికి కావాల్సిన స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. దీంతో అవామీ లీగ్‌ పార్టీ గెలిచినట్టుగా బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం ప్రకటించింది. లెక్కింపు ఇంకా పూర్తి కానప్పటికీ ఇప్పటికే గెలిచిన సీట్ల ప్రకారం అవామీ లీగ్ విజయం సాధించిందని బంగ్లా అధికార మీడియా తెలిపింది.

More Telugu News