Pilot Rohit Reddy: ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డిని రహస్యంగా ఎవరు కలిశారో త్వరలో చెబుతా: పైలట్ రోహిత్ రెడ్డి

Who met Revanth Reddy secretly during the election will be revealed soon says Pilot Rohit Reddy
  • రేవంత్‌ను కలిసిన బీఆర్ఎస్ నేతలు ఎవరో తెలుసునంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే
  • బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసినవారు ఎంతటి హోదాలో ఉన్నా వదిలిపెట్టబోమని హెచ్చరిక
  • సోషల్ మీడియా వేదికగా స్పందించిన పైలట్ రోహిత్ రెడ్డి
తాండూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పైలట్‌ రోహిత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌లో రహస్యంగా ఎవరు కలిశారో తెలుసని, త్వరలోనే వారి పేర్లను వెల్లడిస్తానని అన్నారు. తాండూరు, వికారాబాద్‌ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించి బహుమతిగా అందిస్తానని రేవంత్‌ రెడ్డితో చెప్పింది ఎవరనేది అధిష్ఠానానికి తెలుసని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసినవారు ఎంతటి హోదాలో ఉన్నా వదిలిపెట్టబోమని, సమయం వచ్చినపుడు పార్టీ పెద్దలు ఈ విషయంపై మాట్లాడతారని హెచ్చరించారు. తాండూరు, వికారాబాద్‌, కొడంగల్‌ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఎందుకు ఓడిపోయారనేది ప్రతి ఒక్కరికీ తెలుసని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన చేశారు.
Pilot Rohit Reddy
Revanth Reddy
BRS
Congress
Telangana

More Telugu News