Tiger Attack: చేనులో పత్తి తీస్తున్న మహిళపై పెద్దపులి దాడి.. మృతి

  • మహారాష్ట్రలోని అహేరి తాలూకా చింతల్‌పేట్ గ్రామంలో ఘటన
  • చేనులో పత్తి తీస్తుండగా వెనుక నుంచి వచ్చి దాడి చేసిన పులి
  • సుష్మా అనే 50 ఏళ్ల మహిళ మృతి
  • తెలంగాణ సరిహద్దుకు సమీపంలోనే దాడి జరిగిన చింతల్‌పేట్ గ్రామం
A tiger attacked a woman and died in Aheri taluka In Maharastra

మహారాష్ట్రలోని అహేరి తాలూకా చింతల్‌పేట్ శివారా గ్రామంలో ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది. పొలంలో పత్తి తీస్తున్న మహిళపై పెద్ద పులి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. చనిపోయిన మహిళ పేరు సుష్మా దేవిదాస్ మండల్ (55) అని వెల్లడైంది. అటవీ ప్రాంతంలో ఉన్న చేనులో పత్తి తీస్తుండగా ఉదయం 11 గంటల సమయంలో పులి వెనుక నుంచి వచ్చి దాడి చేసింది. తీవ్రంగా గాయపడడంతో సుష్మ మండల్ అక్కడికక్కడే మృతి చెందింది. అయితే పత్తి తీస్తున్న మహిళలు భయంతో కేకలు వేయడంతో పులి అడవిలోకి వెళ్లిపోయింది. మృతురాలు గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తూ వ్యవసాయ పనులకు వెళ్తుండేదని గ్రామస్తులు తెలిపారు.

కాగా తెలంగాణకు సరిహద్దున ఉండే మహారాష్ట్రలోని అహేరి జిల్లాలో పులుల దాడులు కొనసాగుతున్నాయి. గత ఐదు రోజుల వ్యవధిలో ఇది రెండవ దాడి కావడం గమనార్హం.

More Telugu News