Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి కొత్త బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ హైకమాండ్

  • ఏప్రిల్ లో లోక్ సభ ఎన్నికలు!
  • లోక్ సభ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను నియమించిన కాంగ్రెస్
  • తెలంగాణలో 17 నియోజకవర్గాలకు కోఆర్డినేటర్ల నియామకం
AICC appointed CM Revanth Reddy as coordinator for Chevella and Mahabubnagar Lok Sabha constituencies

ఏప్రిల్ నెలలో లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వివిధ రాష్ట్రాల్లోని లోక్ సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమించింది. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు కూడా సమన్వయకర్తలను నియమించింది. సమన్వయకర్తలుగా మంత్రులు, సీనియర్ నేతలను నియమించింది. ఇక, సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ అదనపు బాధ్యతలు అప్పగించింది. చేవెళ్ల, మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గాల సమన్వయకర్తగా సీఎం రేవంత్ రెడ్డిని నియమించింది. 


ఇతర లోక్ సభ స్థానాల సమన్వయకర్తలు వీరే...

హైదరాబాద్, సికింద్రాబాద్- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
మహబూబాబాద్, ఖమ్మం- పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నాగర్ కర్నూల్- జూపల్లి కృష్ణారావు
నల్గొండ- ఉత్తమ్ కుమార్ రెడ్డి
మల్కాజిగిరి- తుమ్మల నాగేశ్వరరావు
భువనగిరి- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
వరంగల్- కొండా సురేఖ
ఆదిలాబాద్- ధనసరి సీతక్క
మెదక్- దామోదర రాజనర్సింహ
నిజామాబాద్- జీవన్ రెడ్డి
కరీంనగర్- పొన్నం ప్రభాకర్
పెద్దపల్లి- శ్రీధర్ బాబు
జహీరాబాద్- సుదర్శన్ రెడ్డి 

More Telugu News