IAF: కార్గిల్ కొండల్లో సత్తా చాటిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్

IAF lands heavy cargo plane in Kargil hills at night time
  • కార్గిల్ పర్వతాల్లో రాత్రివేళ కార్గో విమానాన్ని ల్యాండింగ్ చేసిన వాయుసేన
  • ప్రతికూల పరిస్థితుల్లోనూ సురక్షితంగా కిందికి దిగిన సీ-130జే విమానం
  • ఇటీవల ఉత్తరాఖండ్ లోనూ రెండు విమానాలను ల్యాండ్ చేసిన వాయుసేన
పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేయడంలో ఆరితేరిన భారత వాయుసేన (ఇండియన్ ఎయిర్ ఫోర్స్) ఇప్పుడు కొత్త సామర్థ్యాన్ని సంతరిచుకుంది. అత్యంత కఠినమైన వాతావరణం ఉండే కార్గిల్ పర్వత ప్రాంతాల్లో రాత్రివేళ భారీ రవాణా విమానాన్ని ల్యాండింగ్ చేసింది. ఇక్కడి చిన్న రన్ వేపై సి-130జే విమానాన్ని విజయవంతంగా ల్యాండింగ్ చేసింది. 

హిమాలయ పర్వత సానువుల్లో సాధారణంగా పగటిపూట కూడా వాతావరణం ఏమాత్రం అనుకూలించదు. అలాంటిది, రాత్రివేళ ఒక భారీ విమానాన్ని ల్యాండింగ్ చేయడం పైలెట్ల నైపుణ్యానికి, తెగువకు పరీక్ష అని చెప్పాలి. ఇప్పుడీ ఘనతను భారత వాయుసేన పైలెట్లు సాధించారు. గరుడ్ కమాండో ట్రైనింగ్ లో భాగంగా ఈ నైట్ ల్యాండింగ్ చేపట్టారు.

ఇటీవల ఉత్తరాఖండ్ లో కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయిన సందర్భంగా కూడా సీ-130జే రవాణా విమానాలను భారత వాయుసేన స్థానిక ఎయిర్ స్ట్రిప్ పై ల్యాండింగ్ చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం ఈ కార్గో విమానాలు సేవలు అందించగలవు.
IAF
C-130J
Kargil
Landing
India

More Telugu News