CM Revanth Reddy: తెలంగాణలో 33 జిల్లాల పునరేకీకరణ దిశగా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన...?

  • గతంలో  తెలంగాణలో 10 జిల్లాలు
  • వాటిని విభజించి 33 జిల్లాలు చేసిన గత ప్రభుత్వం
  • వాటి సంఖ్యను తగ్గించడంపై రేవంత్ దృష్టి!
  • అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టే అవకాశం
CM Revanth Reddy reportedly mulls on districts reorganisation

తెలంగాణలో గత ప్రభుత్వం 10 జిల్లాలను విభజించి మొత్తం 33 జిల్లాలను ఏర్పాటు చేయడం తెలిసిందే. పరిపాలనా సౌలభ్యం పేరిట నాడు కేసీఆర్ సర్కారు ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఇప్పుడు ప్రభుత్వం మారింది. కొత్త సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు వెళుతున్నారు. 

తాజాగా, ఆయన జిల్లాల పునరేకీకరణ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి 33 జిల్లాలు అవసరం లేదన్న భావనతో ఉన్నారు. 33 జిల్లాల్లో బాగా చిన్న జిల్లాలను కలిపేసి, జిల్లాల సంఖ్యను తగ్గించవచ్చని భావిస్తున్నారు. 

ఈ జిల్లాల పునర్ వ్యవస్థీకరణ కోసం ఓ కమిషన్ ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లు పెట్టే అవకాశముంది.

More Telugu News