CEC: ఏపీలో సీఈసీ రాజీవ్ కుమార్ టూర్

  • మూడు రోజులు పర్యటించనున్న సీఈసీ బృందం
  • ఓటర్ల జాబితాలో ఫిర్యాదులపై అధికారులతో సమీక్ష
  • మంగళవారం రాజకీయ పార్టీలతో భేటీ
  • ఈ నెల 10న తిరుగు ప్రయాణం 
CEC Rajeev Kumar Team AP Tour

ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ తో పాటు ఇతర కమిషనర్లు సోమవారం విజయవాడ చేరుకోనున్నారు. సీఈసీ బృందం మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ టూర్ లో భాగంగా మంగళవారం రాష్ట్రంలోని వివిధ పార్టీలతో సీఈసీ రాజీవ్ కుమార్ బృందం భేటీ కానుంది. అనంతరం ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించనుంది.

అసెంబ్లీ ఎన్నికల సంసిద్ధతపై జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ నెల 10న సీఎస్, డీజీపీ, వివిధ శాఖల కార్యదర్శులతో సీఈసీ రాజీవ్ కుమార్ భేటీ అవుతారని అధికారులు తెలిపారు. అదేరోజు సాయంత్రం ఎన్నికల కమిషనర్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడతారని చెప్పారు. సమావేశం పూర్తయ్యాక సీఈసీ బృందం ఢిల్లీకి తిరిగి వెళుతుందని పేర్కొన్నారు.

More Telugu News