MS Dhoni: హుక్కా తాగుతూ గుప్పుగుప్పున పొగ వదిలిన ధోనీ.. వైరల్ వీడియో ఇదిగో

Video Of MS Dhoni Smoking Hookah Goes Viral
  • సూటులో హుక్కా తాగుతూ కనిపించిన ధోనీ
  • న్యూ ఇయర్ పార్టీ అయి ఉంటుందంటున్న నెటిజన్లు
  • ధోనీకి హుక్కా తాగడం ఇష్టమన్న సీఎస్‌కే మాజీ సహచరుడు

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఓ పార్టీలో హుక్కా తాగుతూ గుప్పుగుప్పున పొగ వదులుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూట్ ధరించి ఉన్న ధోనీ చేతిలో హుక్కా పైప్ కనిపిస్తోంది. అయితే, అది ఏ సందర్భం అన్నది తెలియరానప్పటికీ న్యూ ఇయర్ పార్టీ అయి ఉంటుందని నెటిజన్లు చెబుతున్నారు. 

ధోనీ వీడియో వైరల్ కావడంతో సీఎస్‌కే మాజీ సహచరుడు, ఆస్ట్రేలియా మాజీ స్టార్ జార్జ్ బెయిలీ స్పందించాడు. ధోనీ హుక్కా తాగడాన్ని ఇష్టపడతాడని పేర్కొన్నాడు. ధోనీ తరచూ తన గదిలో హుక్కా సెటప్ చేసేవాడని, అందులోకి ఎవరైనా వెళ్లొచ్చని, అక్కడ చాలామంది యువ ఆటగాళ్లు ఉండడాన్ని కూడా మీరు చూడొచ్చని తెలిపారు.  

అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ ఐపీఎల్‌లో ఆడుతున్న ధోనీ 2024 సీజన్‌లోనూ చెన్నైకి ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. బహుశా ఇదే అతడి చివరి లీగ్ అయ్యే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News