Botsa Satyanarayana: 'విద్య'లో కేరళను అధిగమించడం పట్ల గర్విస్తున్నాం: మంత్రి బొత్స

  • ఏపీలో ప్రాథమిక అక్షరాస్యత శాతం 38.50
  • కేరళను వెనక్కినెట్టిన ఏపీ
  • అసాధ్యం అనుకున్నది సాధ్యం చేసి చూపామన్న మంత్రి బొత్స
  • కేవలం ఐదేళ్లలోనే ఏపీ విద్యావ్యవస్థను మార్చివేశామని వెల్లడి
Botsa responds on AP becomes number one in in foundational literacy

జాతీయస్థాయిలో విద్యా సౌలభ్యం కలిగిన రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందంటూ మీడియాలో వచ్చిన కథనం పట్ల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. 

అత్యధికులకు విద్యను అందుబాటులోకి తెచ్చిన రాష్ట్రంగా ఏపీ ఇప్పుడు కేరళను అధిగమించిందని బొత్స వెల్లడించారు. ఈ అంశంలో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ గా నిలవడం పట్ల తమ ప్రభుత్వం గర్విస్తోందని తెలిపారు. 

ఈఏసీ-పీఎం (ప్రధాని ఆర్థిక సలహా మండలి) విడుదల చేసిన ప్రాథమిక అక్షరాస్యత నివేదికలో ఏపీ 38.50 శాతంతో అగ్రస్థానంలో నిలిచిందని, కేరళ 36.55తో రెండో స్థానంలో ఉందని బొత్స వివరించారు. 

డైనమిక్ నేత, దార్శనికుడు సీఎం జగన్ నాయకత్వంలో, ప్రభావవంతమైన పాలనలో అసాధ్యం అనుకున్నది సాధ్యం చేసి చూపామని పేర్కొన్నారు. కేవలం ఐదేళ్ల వ్యవధిలోనే ఏపీ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దామని మంత్రి బొత్స తెలిపారు.

More Telugu News