Tammineni Sitaram: నాకు పెద్ద వ్యాధి వచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు: తమ్మినేని సీతారాం

They are spreading false propaganda that I have a serious disease says Tammineni Sitaram
  • అస్వస్థతకు గురైన తమ్మినేని సీతారాం
  • త్వరలోనే ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొంటానని ప్రకటన
  • సోమవారం నుంచి ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతానని వెల్లడి
తనకు పెద్ద వ్యాధి వచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. "నాయకులకు, కార్యకర్తలకు నా ముఖ్యమైన విజ్ఞప్తి. త్వరలోనే నేను ప్రజాహిత కార్యక్రమాలకు వస్తాను. ప్రజల సంక్షేమం కోసం నేను కచ్చితంగా పర్యటిస్తా. ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేస్తా. ఇది నా బాధ్యత. ఎవరు ఎన్ని అనుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఏదో పెద్ద జబ్బు వచ్చింది, వ్యాధి వచ్చిందని ప్రచారం చేయడం సరికాదు. సోమవారం నుంచి ప్రభుత్వ కార్యక్రమాలకు యథావిధిగా హాజరవుతా" అని తమ్మినేని వీడియోలో తెలిపారు. 
Tammineni Sitaram
YSRCP

More Telugu News