Formula E Race: హైదరాబాద్ లో జరగాల్సిన ఫార్ములా-ఈ రేసు రద్దు

Hyderabad Formula E Race cancelled
  • ఫిబ్రవరి 10న జరగాల్సిన రేసు
  • రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్న నిర్వాహకులు
  • మున్సిపల్ శాఖకు నోటీసులు ఇస్తామని వెల్లడి
హైదరాబాద్ లో జరగాల్సిన ఫార్ములా-ఈ రేసు రద్దయింది. రేసును రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో రేసును రద్దు చేస్తున్నట్టు తెలిపారు. రేసుకు సంబంధించిన ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు మున్సిపల్ శాఖకు నోటీసులు ఇస్తామని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 10న ఈ రేసు జరగాల్సి ఉంది. 

రేసు రద్దు కావడంపై ఫార్ములా-ఈ కోఫౌండర్, చీఫ్ ఛాంపియన్ షిప్ ఆఫీసర్ అల్బర్టో లోంగో మాట్లాడుతూ... చాలా అసంతృప్తికి గురవుతున్నామని చెప్పారు. ఇండియాలో మోటార్ స్పోర్ట్ కు చాలా ఫ్యాన్ బేస్ ఉందని... రేసు రద్దు కావడం బాధాకరమని అన్నారు. ఒక అఫీషియల్ మోటార్ స్పోర్ట్ వరల్డ్ ఛాంపియన్ షిప్ ను నిర్వహించడం హైదరాబాద్ కే కాకుండా యావత్ భారతదేశానికి గర్వకారణమని చెప్పారు.
Formula E Race
Hyderabad

More Telugu News