Shivaraj Kumar: రామ్ చరణ్ సినిమాలో కీలకపాత్రలో శివరాజ్ కుమార్

  • ప్రస్తుతం గేమ్ చేంజర్ లో నటిస్తున్న రామ్ చరణ్
  • ఆ తర్వాత బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో చిత్రం
  • రామ్ చరణ్ చిత్రంలో కీలక పాత్ర కోసం తనను సంప్రదించారన్న శివన్న
  • ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడి
Shivaraj Kumar enters Tollywood through Ram Charan movie

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూర్తయితే రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో చిత్రం ప్రారంభం కానుంది. ఇది స్పోర్ట్స్ సబ్జెక్టుతో తెరకెక్కనుంది. 

కాగా, ఈ సినిమాతో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. శివరాజ్ కుమార్ గతంలో బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలో అతిథిపాత్రలో కనిపించారు. 

రామ్ చరణ్ కొత్త చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం చిత్రబృందం తనను సంప్రదించినట్టు శివరాజ్ కుమార్ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

రామ్ చరణ్, బుచ్చిబాబు కలయికలో వస్తున్న చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండడం విశేషం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి.

More Telugu News