YS Sharmila: ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న వైఎస్ షర్మిల

YS Sharmila reaches Hyderabad today
  • నిన్న మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన షర్మిల
  • సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి షర్మిల రాక
  • ఏ బాధ్యత అప్పగించినా నెరవేరుస్తానన్న షర్మిల
కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ఆమె ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రాగా... కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. బుధవారం ఢిల్లీకి చేరుకున్న వైఎస్ షర్మిల.. గురువారం రోజున ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో... పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ రోజు వరకు ఢిల్లీలోనే ఉన్న షర్మిల సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరి.. హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... పార్టీ అధిష్ఠానం తనకు ఏ బాధ్యత అప్పగించినా నెరవేరుస్తానని చెప్పారు.
YS Sharmila
Congress
Telangana
Andhra Pradesh

More Telugu News