Revanth Reddy: నిర్మలా సీతారామన్‌ను కలిసి తెలంగాణ ఆర్థిక పరిస్థితిని వివరించిన రేవంత్ రెడ్డి

Revanth reddy and Uttam Kumar Reddy has called on Finance Minister Nirmala Sitharaman
  • రేవంత్ రెడ్డితో పాటు ఆర్థికమంత్రిని కలిసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • బీఆర్జీఎఫ్ కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.1,800 కోట్ల బకాయిలపై వినతిపత్రం
  • తెలంగాణ రాష్ట్రం తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయిందని వెల్లడి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. దాదాపు గంటసేపు ఈ భేటీ జరిగింది. బ్యాక్‌వర్డ్ రీజియన్స్ గ్రాంట్ ఫండ్ (బీఆర్జీఎఫ్) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.1,800 కోట్ల బకాయిలపై వినతి పత్రం ఇచ్చారు. అదే సమయంలో పదిహేనో ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయిందని కేంద్ర ఆర్థికమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రానికి తగిన ఆర్థిక సాయం చేయాలని కోరారు. కాగా, నిర్మలా సీతారామన్‌తో భేటీ అనంతరం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు బయలుదేరారు. సీఎం, మంత్రి ఉత్తమ్... రెండు రోజుల పాటు ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు.
Revanth Reddy
Nirmala Sitharaman
Congress
BJP

More Telugu News