Gopichand: రాక్షసుల్ని వేటాడే బ్రహ్మరాక్షసుడు... గోపీచంద్ 'భీమా' చిత్రం టీజర్ విడుదల

  • గోపీచంద్ హీరోగా పక్కా యాక్షన్ మూవీ
  • ఎ.హర్ష దర్శకత్వంలో చిత్రం
  • పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా గోపీచంద్
  • ఫిబ్రవరి 16న రిలీజ్
Gopichand Bhimaa teaser out now

గోపీచంద్ హీరోగా ఎ.హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'భీమా'. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా అదిరిపోయే టీజర్ రిలీజైంది. 

"రాక్షసుల్ని వేటాడే బ్రహ్మరాక్షసుడు వచ్చాడ్రా" అంటూ వినిపించే డైలాగ్ హీరో గోపీచంద్ ఎంట్రీని పవర్ ఫుల్ గా మార్చేసింది. గోపీచంద్ ఇందులో అక్రమార్కుల భరతం పట్టే పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. 

కాగా, ఈ చిత్రంలో ప్రియాభవానీ శంకర్, మాళవిక శర్మ, నాజర్, నరేశ్, పూర్ణ, వెన్నెల కిశోర్, రఘుబాబు తదితరులు నటించారు. పక్కా యాక్షన్ జానర్ లో తెరకెక్కుతున్న చిత్రానికి కన్నడ మ్యూజిక్ డైరక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

More Telugu News