IT Employee Kidnap: హైదరాబాద్ లో కలకలం రేపుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిడ్నాప్

IT employee in Hyderabad kidnapped
  • ఐటీ ఉద్యోగి గుర్రం సురేంద్ర కిడ్నాప్
  • బాధితుడి భార్యకు ఫోన్ చేసి రూ. 60 లక్షలు డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు
  • కిడ్నాపర్ల కోసం గాలిస్తున్న నాలుగు పోలీసు బృందాలు
హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిడ్నాప్ కు గురైన ఘటన కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు ఐటీ ఉద్యోగి గుర్రం సురేంద్ర బాబును నిన్న సాయంత్రం కిడ్నాప్ చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేర్ ఆసుపత్రి వద్ద కిడ్నాప్ జరిగింది. కారులో వచ్చిన దుండగులు బాధితుడిని తీసుకెళ్లారు. కిడ్నాప్ చేసిన దుండగులు సదరు ఉద్యోగి భార్యకు ఫోన్ చేసి రూ. 60 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. బాధితుడి భార్యకు వీరు వైఫై కాల్స్ చేస్తున్నారు. గుర్రం సురేంద్ర బాబు తన కుటుంబంతో కలిసి కేపీహెచ్బీ కాలనీలో ఉంటున్నారు. కిడ్నాప్ గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. కిడ్నాపర్లను పట్టుకునేందుకు నాలుగు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.  
IT Employee Kidnap
Hyderabad

More Telugu News