Stock Market: వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • ఐటీ స్టాక్స్ మద్దతుతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు
  • 179 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 52 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండో రోజు లాభాలను ఆర్జించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ... ఐటీ స్టాక్స్ తో పాటు, రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థల్లో కొనుగోళ్ల మద్దతుతో మన మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 179 పాయింట్లు లాభపడి 72,026కి చేరుకుంది. నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 21,711 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టీసీఎస్ (1.93%), ఎల్ అండ్ టీ (1.62%), ఇన్ఫోసిస్ (1.37%), యాక్సిస్ బ్యాంక్ (1.16%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.13%). 

టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-1.65%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-1.06%), కోటక్ బ్యాంక్ (-0.83%), సన్ ఫార్మా (-0.78%), ఏసియన్ పెయింట్స్ (-0.71%).

More Telugu News