Revanth Reddy: యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Revanth reddy has called on UPSC Chairman Dr Manoj Soni
  • ఢిల్లీలో రెండో రోజు కొనసాగుతున్న రేవంత్ రెడ్డి పర్యటన
  • యూపీఎస్సీ చైర్మన్‌తో భేటీలో మంత్రి ఉత్తమ్, సీఎస్, అధికారులు
  • టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై మనోజ్ సోనీతో చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి శుక్రవారం యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీని మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేడు... రెండో రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా యూపీఎస్సీ చైర్మన్‌తో భేటీ అయ్యారు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌లతో పాటు సీఎస్ శాంతికుమారి, ఇద్దరు ఐఏఎస్ అధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. యూపీఎస్సీ తరహాలో తెలంగాణల పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను పకడ్బందీగా తీర్చిదిద్దుతామని... ప్రశ్నాపత్రాల లీకేజీ లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై యూపీఎస్సీ చైర్మన్‌తో చర్చించినట్లుగా తెలుస్తోంది. పరీక్షలకు సంబంధించి యూపీఎస్సీ అవలంబించే విధానాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం.
Revanth Reddy
upsc
Telangana
Congress
Uttam Kumar Reddy

More Telugu News