Tammineni Sitaram: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు అస్వస్థత

AP Assembly speaker admitted in hospital srikakulam
  • గురువారం నీరసంగా ఉన్న తమ్మినేనిని ఆసుపత్రికి తరలించిన కుటుంబసభ్యులు
  • మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స
  • ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న వైద్యులు
  • ఒక రోజు పర్యవేక్షణలో ఉంచి పంపిస్తామని చెప్పిన వైనం
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అస్వస్థతకు గురయ్యారు. శ్రీకాకుళంలోని మెడికవర్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. గురువారం రాత్రి నీరసంగా ఉన్న ఆయనను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. కార్డియాలజిస్ట్ బుడుమూరు అన్నాజీరావు, ఫిజిషియన్ వేణుగోపాలరావు పలు వైద్య పరీక్షలు చేశారు. ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, అందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఒక రోజు పర్యవేక్షణలో ఉంచి తరువాత డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు.
Tammineni Sitaram
Srikakulam District
YSRCP
AP ASsembly

More Telugu News