Elon Musk: ఉద్యోగులను తొలగించి చిక్కుల్లో పడిన ఎలాన్ మస్క్

Elon Musk Illegally Fired workers
  • 8 మంది ఉద్యోగులను చట్టవిరుద్ధంగా తొలగించారంటూ ఆరోపణలు
  • కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లకు మస్క్ రాసిన లేఖను బయటపెట్టారంటూ ఉద్యోగులపై వేటు
  • ఎన్ఎల్ఆర్‌బీకి కార్మిక సంస్థ ఫిర్యాదు
స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ చిక్కుల్లో పడ్డారు. మస్క్ ప్రవర్తనను తెలియజేసే లేఖను బయటపెట్టారంటూ 8 మంది ఉద్యోగులను సంస్థ నుంచి చట్టవిరుద్ధంగా తొలగించారంటూ అమెరికా లేబర్ ఏజెన్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగుల హక్కులను కాలరాశారంటూ స్పేస్ ఎక్స్‌పై జాతీయ కార్మిక సంబంధాల బోర్డు (ఎన్ఎల్‌ఆర్‌బీ) ఫిర్యాదు చేసింది.

స్పేస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్‌లకు మస్క్ జూన్ 2022లో పంపిన ఆ లేఖలో 2020 నుంచి మస్క్ చేసిన వరుస ట్వీట్లు ఉన్నాయి. అందులో కొన్ని లైంగిక పరమైన అంశాలు కూడా ఉన్నాయి. మస్క్ ప్రకటనలు కంపెనీ విధానాలకు అనుగుణంగా లేవని, అవి కార్యాలయంలో దుష్ప్రవర్తనకు అనుగుణంగా లేవని పేర్కొన్న ఉద్యోగులు వాటిని ఖండించాలని స్పేస్ఎక్స్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో దీనిపై దృష్టిసారించిన అమెరికా కార్మిక సంస్థ ఉద్యోగులను చట్టవిరుద్ధంగా తొలగించారంటూ ఎన్‌ఎల్ఆర్‌బీకి ఫిర్యాదు చేసింది.
Elon Musk
SpaceX
National Labor Relations Board
USA

More Telugu News