గొంతు పెంచడం ద్వారా కోర్టును బెదిరించలేరు: న్యాయవాదిపై సీజేఐ చంద్రచూడ్ సీరియస్
- వాదనల సందర్భంగా గట్టిగా మాట్లాడిన న్యాయవాది
- గొంతు తగ్గించాలన్న సీజేఐ చంద్రచూడ్
- సీజేఐకి క్షమాపణ చెప్పిన న్యాయవాది
దేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో మీరు వాదించే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు. జడ్జిల దగ్గర మీరు ఎప్పుడూ ఇలాగే వాదిస్తుంటారా? అని అడిగారు. సంయమనం పాటించాలని సూచించారు. దీంతో చీఫ్ జస్టిస్ కు సదరు న్యాయవాది క్షమాపణ చెప్పారు. గతంలో కూడా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వికాస్ సింగ్ ఇలాగే మాట్లాడటంతో తగ్గాలంటూ సీజేఐ అసహనం వ్యక్తం చేశారు.