బీజేపీ కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్గా బండి సంజయ్ నియామకం.. ఎన్నికల ముందు కీలక బాధ్యతలు
- 2024 ఎన్నికలకు ముందు పునర్వ్యవస్థీకరణ చేపట్టిన బీజేపీ అధిష్ఠానం
- యువమోర్చా ఇన్ఛార్జ్గా సునీల్ బన్సల్కు బాధ్యతల అప్పగింత
- తరుణ్ చుగ్ సహా పలువురు సీనియర్లను వివిధ విభాగాలకు ఇన్ఛార్జులుగా నియామకం
కాగా జులై 2023లో చివరిసారిగా బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్లను పునర్వ్యవస్థీకరించింది. ఇక గతేడాది డిసెంబర్లో బీజేపీ పంజాబ్ రాష్ట్ర పార్టీ విభాగాల ఇన్ఛార్జులను మార్చింది. వివిధ విభాగాలకు 70 మందితో ఇన్ఛార్జులు, సహ ఇన్ఛార్జులను ప్రకటించిన విషయం తెలిసిందే. 2024 లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో బీజేపీ ఈ మేరకు పార్టీలో మార్పులు చేస్తోంది.