Shashi Vadane: హృదయాన్ని హత్తుకునేలా ‘శశివదనే’ టీజర్!

  • మరోప్రేమకథగా 'శశివదనే' 
  • రక్షిత్ అట్లూరి జోడీగా కోమలి
  • ఆసక్తిని పెంచుతున్న టీజర్ 
  • దర్శకుడిగా సాయిమోహన్ పరిచయం 

Shashivadane trailer released

'పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి .. కోమలీ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శశివదనే’. ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల దీనిని నిర్మించారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు, సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వహించాడు. చిత్రీకరణను ముగించుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. 

‘శశివదనే’ సినిమా టీజర్‌ను మేకర్స్ ఈ రోజున (బుధవారం) విడుదల చేశారు. టీజర్‌ను గమనిస్తే ఇది విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే అహ్లాదకరమైన ప్రేమకథ అని తెలుస్తోంది. హీరో - హీరోయిన్ మధ్య ఉన్న ప్రేమ సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటున్నాయి. ఇక టీజర్ ఎండింగ్‌లో హీరో రక్షిత్ లుక్ చూస్తుంటే కథలో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఉండబోతుందని తెలుస్తుంది. 

ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదలైన మూవీ టైటిల్ సాంగ్ ‘శశివదనే..’, ‘డీజే పిల్లా..’ అనే సాంగ్‌కు ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు విడుదలైన టీజర్ ఈ అంచనాలను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళుతుంది. నిర్మాణాంతర కార్యక్రమాలతో బిజీగా ఉన్న శశివదనే చిత్రం ట్రైలర్, రిలీజ్ డేట్‌పై మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు.  



More Telugu News