Ram Gopal Varma: 'వ్యూహం' సినిమా నిర్మాతకు మరోసారి నిరాశ

Disappointment for Ram Gopal Varma in TS High Court
  • 'వ్యూహం' సినిమా విడుదలను ఆపేసిన హైకోర్టు సింగిల్ బెంచ్
  • సినిమా విడుదల కాకపోవడం వల్ల కోట్ల నష్టం వచ్చిందని పిటిషన్ వేసిన నిర్మాత
  • సింగిల్ బెంచ్ లోనే తేల్చుకోవాలన్న హైకోర్టు డివిజన్ బెంచ్ 
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం చిత్ర నిర్మాతకు తెలంగాణ హైకోర్టులో మరోసారి నిరాశ ఎదురయింది. సీఎం జగన్ కు అనుకూలంగా, టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా 'వ్యూహం' చిత్రాన్ని వర్మ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే, చంద్రబాబు వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ చిత్రం విడుదలను ఆపేయాలని టీడీపీ యువనేత నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ నెల 11వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది. సినిమా సెన్సార్ సర్టిఫికెట్ పై స్టే విధించింది. 

ఈ నేపథ్యంలో, ఈ చిత్ర నిర్మాత హైకోర్టు డివిజన్ బెంచ్ లో మరో పిటిషన్ వేశారు. తాజా పిటిషన్ లో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేశారు. సినిమా విడుదల కాకపోవడం వల్ల తమకు కోట్ల రూపాయల నష్టం వచ్చిందని కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ధర్మాసనం సింగిల్ బెంచ్ లోనే తేల్చుకోవాలని పిటిషనర్ కు సూచించింది.
Ram Gopal Varma
Tollywood
Vyuham

More Telugu News