Virtuvally Gang Rape: 16 ఏళ్ల బాలికపై వర్చువల్‌గా సామూహిక లైంగికదాడి.. ప్రపంచంలోనే తొలికేసు!

  • మెటావర్స్‌లో గేమ్ ఆడుతుండగా ఘటన
  • బాలిక అవతార్‌పై గుర్తు తెలియని వ్యక్తుల అత్యాచారం
  • ఘటన తర్వాత తీవ్ర మానసిక గాయాన్ని అనుభవిస్తోందన్న పోలీసులు
16 Year old girl virtually gang raped police begin probe

ప్రపంచంలోనే తొలిసారి 16 ఏళ్ల యూకే బాలిక వర్చువల్‌గా అత్యాచారానికి గురైంది. ‘మెటావర్స్’ ద్వారా ఆన్‌లైన్‌లో జరిగిన ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు కోసం రంగంలోకి దిగారు. ఆన్‌లైన్ గేమ్‌లో తన అవతార్ (బాలిక డిజిటల్ కేరెక్టర్)పై గుర్తు తెలియని ఆన్‌లైన్ వ్యక్తులు సామూహిక లైంగికదాడికి పాల్పడినట్టు బాలిక ఆరోపించింది. ఈ ఘటన తర్వాత బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది. 

బాలిక వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్ ధరించి ఆటలో లీనమై ఉన్న సమయంలో కొంతమంది యువకులు ఆమెపై సామూహిక అఘాయిత్యానికి పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొంది. బాలిక శరీరంపై ఎలాంటి గాయలు లేనప్పటికీ వాస్తవ ప్రపంచంలో అత్యాచారం జరిగినట్టుగానే ఆమె వ్యవరిస్తోందని, ఆమె తీవ్రమైన మానసిక గాయాన్ని అనుభవిస్తున్నట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు. 

ఇలాంటి కేసును పోలీసులు దర్యాప్తు చేయడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. బాధిత బాలికకు అయిన మానసిక గాయం చాలాకాలం పాటు ఆమెను వెంటాడుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుత చట్టంలో ఇటువంటి వాటికి సంబంధించి ఎలాంటి నిబంధన లేనందున దీనిపై పోలీసులు ముందుకు ఎలా వెళ్తారన్నది సర్వత్ర చర్చనీయాంశమైంది. కాగా, బాధిత బాలిక ఆ సమయంలో ఎలాంటి గేమ్ ఆడుతోందన్న విషయంలో స్పష్టత లేదు.

More Telugu News