YS Sharmila: ఈరోజు జగన్ ను కలవనున్న వైఎస్ షర్మిల

YS Sharmila to meet Jagan today
  • ఇడుపులపాయ నుంచి తాడేపల్లికి వెళ్తున్న షర్మిల
  • జగన్ కు తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను అందించనున్న షర్మిల
  • అనంతరం విజయవాడ నుంచి ఢిల్లీకి పయనం
చాలా కాలం తర్వాత తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ ను వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కలవనున్నారు. ప్రస్తుతం ఇడుపులపాయలో ఉన్న షర్మిల... తన కుటుంబ సభ్యులతో కలిసి తాడేపల్లిలోని జగన్ నివాసానికి ఈరోజు వెళ్లనున్నారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో వీరు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అనంతరం తాడేపల్లిలోని నివాసానికి వెళ్తారు. ఈ సందర్భంగా తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను జగన్ కు అందిస్తారు. అనంతరం సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి బయల్దేరుతారు. రేపు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గేలతో ఆమె సమావేశం కానున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరబోతున్న సంగతి తెలిసిందే.
YS Sharmila
YSRTP
Jagan
YSRCP

More Telugu News