Mallu Bhatti Vikramarka: సామాన్య వ్యక్తుల్లా ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మల్లు భట్టి, కుటుంబ సభ్యులు... వీడియో ఇదిగో

Mallu Bhatti Vikramarka travelled by bus along with their family members
  • విమానాశ్రయం నుంచి బస్సులో ప్రయాణించిన మల్లు భట్టి, కుటుంబం
  • వీడియోను ట్వీట్ చేసిన కాంగ్రెస్ ఫర్ తెలంగాణ ట్విట్టర్ హ్యాండిల్
  • నెట్టింట వైరల్‌గా మారిన మల్లు భట్టి వీడియో
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆయన కుటుంబ సభ్యులు సాధారణ ప్రయాణికుల్లా ఓ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన విమానాశ్రయం నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఓ ప్రయాణికుడు వీడియో తీయడంతో ఇది నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోకు సంబంధించి కాంగ్రెస్ ఫర్ తెలంగాణ ట్విట్టర్ హ్యాండిల్ ఓ ట్వీట్ చేసింది. 'సామాన్య వ్యక్తుల్లా బస్సులో ప్రయాణించిన మల్లు భట్టి కుటుంబం' అంటూ ట్వీట్ చేసింది.

'నిన్న సాయంత్రం హైదరాబాద్ విమానాశ్రయంలో యాదృచ్ఛికంగా ఒక ప్రయాణికుడు విమానం దిగి వచ్చే బస్సులో తీసిన వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మల్లు గారు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఒక సామాన్య వ్యక్తిలా అధికార ఆర్భాటాలు లేకుండా బస్సులో నిలబడి ప్రయాణించారు. ఇది కదా ప్రజాపాలన అని అక్కడ ఉన్న ప్రయాణికులు చర్చించుకున్నారు.' అని పేర్కొంది.
Mallu Bhatti Vikramarka
Telangana
Congress

More Telugu News