Chinmayi Sripaada: నన్ను వేధించిన వ్యక్తికి తమిళనాడులో కొందరు శక్తిమంతమైన వ్యక్తులు మద్దతిస్తున్నారు: చిన్మయి శ్రీపాద

  • గీత రచయిత వైరముత్తుపై గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు
  • అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసిన సింగర్ చిన్మయి శ్రీపాద
  • తాజాగా, వైరముత్తు రచించిన 'మహా కవితై' పుస్తకావిష్కరణ
  • హాజరైన సీఎం స్టాలిన్, పి.చిదంబరం, కమల్ హాసన్
  • వైరముత్తుకు ఉన్న రాజకీయ మద్దతు చూడండి అంటూ చిన్మయి ట్వీట్
Chinmayi Sripaada comments on Vairamuthu book launching

ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద మరోసారి వార్తల్లోకెక్కారు. ఆమె గతంలో ప్రముఖ లిరిక్ రైటర్ వైరముత్తుపై సంచలన ఆరోపణలు చేశారు. వైరముత్తు తనను లైంగికంగా వేధించారని చిన్మయి చేసిన వ్యాఖ్యలు ఆప్పట్లో తీవ్ర కలకలం రేపాయి. మీటూ ఉద్యమానికి ఒకరకంగా చిన్నయి ఆరోపణలే నాంది అని చెప్పకోవచ్చు. 

అయితే, చిన్మయి తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఆమెపై తమిళ చిత్ర పరిశ్రమ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. 

తాజాగా, వైరముత్తు రచించిన 'మహా కవితై' పుస్తకావిష్కరణ కార్యక్రమం చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం, అగ్రశ్రేణి నటుడు కమల్ హాసన్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. 

అయితే, దీన్ని చిన్మయి శ్రీపాద తప్పుబడుతున్నారు. తనను వేధించిన వ్యక్తికి తమిళనాడులోని కొందరు శక్తిమంతమైన ప్రముఖులు మద్దతిస్తున్నారంటూ ఆమె సోషల్ మీడియాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైరముత్తుతో పాటు ఎంతమంది రాజకీయవేత్తలు ఉన్నారో చూడండి... ఇలాంటి వాతావరణంలో ఎవరికైనా న్యాయం జరుగుతుందా? అని చిన్మయి ఆవేదన వెలిబుచ్చారు.

More Telugu News