Dadi Veerabhadra Rao: టీడీపీ గూటికి తిరిగి రానున్న దాడి వీరభద్రరావు!

Dadi Veerabhadra Rao reportedly will join TDP
  • వైసీపీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు
  • తండ్రి బాటలోనే దాడి వీరభద్రరావు కుమారులు
  • త్వరలోనే చంద్రబాబు, లోకేశ్ లతో దాడి వీరభద్రరావు సమావేశమయ్యే అవకాశం
సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీకి గుడ్ బై చెప్పడం తెలిసిందే. దాడి వీరభద్రరావుతో పాటు ఆయన కుమారులు జైవీర్, రత్నాకర్ కూడా వైసీపీని వీడారు. ఈ నేపథ్యంలో, దాడి వీరభద్రరావు రాజకీయ పయనం ఎటు అన్న అంశం ఆసక్తికరంగా మారింది.

అయితే, ఆయన టీడీపీ గూటికి తిరిగి రానున్నట్టు తెలుస్తోంది. దాడి వీరభద్రరావు తన కుమారులతో కలిసి చంద్రబాబు, లోకేశ్ లతో భేటీ కానున్నట్టు సమాచారం. పార్టీలో చేరే అంశంపై చంద్రబాబుతో చర్చించనున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఆయన జనసేనలో చేరే అవకాశాలున్నాయని కూడా మీడియాలో ప్రచారం జరుగుతోంది.

దాడి వీరభద్రరావు 2014కి ముందు వరకు టీడీపీలోనే ఉన్నారు. 2019లో ఆయన వైసీపీలో చేరారు. అనకాపల్లి నుంచి పోటీ చేయాలని దాడి వీరభద్రరావు భావించినప్పటికీ, ఆయనకు వైసీపీ నాయకత్వం టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడాయన రాజీనామాతో అనకాపల్లి జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలినట్టయింది.
Dadi Veerabhadra Rao
TDP
Chandrababu
Nara Lokesh
YSRCP
Andhra Pradesh

More Telugu News