Hanu Man: ఓ వైపున నాలుగు భారీ సినిమాలు .. మరో వైపున 'హను మాన్'

  • 12వ తేదీన 'గుంటూరు కారం'
  • అదే రోజున బరిలోకి దిగుతున్న 'హను మాన్' 
  • 13వ తేదీన వెంకీ 'సైంధవ్' .. రవితేజ 'ఈగల్'
  • 14న రానున్న 'నా సామిరంగ'
  • ఈ మధ్య కాలంలో చూడని పోటీ ఇది  

Hanu Man Movie Update

సంక్రాంతి అంటే పల్లె పండుగ మాత్రమే కాదు .. సినిమాల పండుగ కూడా. ఎన్టీఆర్  - ఏఎన్నార్ కాలం నుంచే సంక్రాంతి పండుగకి .. సినిమాలకి మధ్య ఒక అనుబంధం ఉందనే విషయం అర్థమవుతుంది. ఇక సంక్రాంతికి కృష్ణ సినిమాలు తప్పకుండా బరిలో కనిపించేవి. అలా సంక్రాంతికి తమ సినిమాలు ఉండేలా హీరోలు చూసుకోవడం మొదలైంది. 

ఈ సారి సంక్రాంతికి ఐదు సినిమాలు విడుదలవుతూ ఉండటం విశేషం. 12 వ తేదీన 'గుంటూరు కారం' .. 'హను మాన్' .. 13వ తేదీన 'సైంధవ్' .. 'ఈగల్' .. 14వ తేదీన 'నా సామిరంగ' థియేటర్లలో దిగనున్నాయి. ఈ ఐదు సినిమాల్లో రెండు సినిమాలు వెనక్కి తగ్గొచ్చుననే టాక్ వినిపించింది. కానీ అందరూ వరుసగా రిలీజ్ డేట్స్ ప్రకటించేశారు. 

అయితే మిగతా నాలుగు సినిమాలతో పోలిస్తే 'హను మాన్' చిన్న సినిమానే. బడ్జెట్ పరంగా .. స్టార్స్ పరంగా చూసినా ఇది వాటి తరువాత స్థానంలో నిలిచే సినిమానే. ఇలా నాలుగు భారీ సినిమాలతో పోటీగా ఒక చిన్న సినిమా దిగడం ఈ మధ్య కాలంలో జరగలేదనే చెప్పాలి. అయినా కంటెంట్ పై నమ్మకంతో ఈ సినిమా ధైర్యంగా బరిలోకి దిగింది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ ఆకట్టుకునే సూపర్ హీరో కంటెంట్ ను కలిగి ఉండటం ఈ సినిమాకి ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Telugu News