metro rail: హైదరాబాద్ మెట్రో రైలు పొడిగింపు, ప్రస్తుత పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

CM Revanth Reddy review on Metro rail
  • మెట్రో రైలుపై దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి
  • మధ్యాహ్నం అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి
  • అంతకుముందు సీఎంతో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ భేటీ
హైదరాబాద్ మెట్రో రైల్వే లైన్ పొడిగింపు, ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాజధాని మెట్రో రైలు పొడిగింపుపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో మార్గం... మియాపూర్ నుంచి రామచంద్రాపురంకు, మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు మెట్రో పొడిగింపు తదితర అంశాలపై నిన్న ఆయన స్పందించారు. ఈ క్రమంలో ఈ రోజు మెట్రో రైలుకు సంబంధించి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, సుమన్ భేరి, సభ్యులు వీకే సారస్వత్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు.
metro rail
Hyderabad
Revanth Reddy
Congress

More Telugu News