Devara: 'దేవర' గ్లింప్స్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిటింగ్!

  • 'దేవర'గా కనిపించనున్న ఎన్టీఆర్ 
  • అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి 
  • ఈ నెల 8వ తేదీన గ్లింప్స్ రిలీజ్ 
  • ఏప్రిల్ 5వ తేదీన సినిమా విడుదల 

Devara Movie Update

ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్లో 'దేవర' సినిమా రూపొందుతోంది. యువసుధ ఆర్ట్స్ - ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. వివిధ రకాల ఆయుధాలతో డిజైన్ చేయించిన 'దేవర' టైటిల్ ను వదిలిన దగ్గర నుంచి అందరిలో అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ లుక్ ... పోస్టర్స్ అందరిలో మరింతగా ఆసక్తిని పెంచుతూ .. గ్లింప్స్ కోసం వెయిట్ చేయిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఈ నెల 8వ తేదీన గ్లింప్స్ ను వదలనున్నట్టుగా నిన్న ప్రకటించారు. దాంతో 8వ తేదీ ఎంత తొందరగా వస్తుందా అని అభిమానులంతా ఆరాటంతో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా విజువల్స్ అద్భుతమంటూ ఇటీవల కల్యాణ్ రామ్ చెప్పిన దగ్గర నుంచి అందరిలో ఉత్కంఠ రెట్టింపు అయింది. 

ప్రస్తుతం ఈ గ్లింప్స్ కి సంబంధించిన వర్క్ జరుగుతోందని అంటున్నారు. అనిరుధ్ అందించిన సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇక జాన్వీ కపూర్ కి సంబంధించిన అప్ డేట్స్ కూడా ఇవ్వకుండా గోప్యంగా ఉంచుతున్నారు. దాంతో ఆ వైపు నుంచి కూడా కుతూహలం పెరుగుతోంది. ఏప్రిల్ 5వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. 

More Telugu News