Rajamouli: జపాన్ లో భూకంపం కలచివేసింది: రాజమౌళి

  • నిన్న జపాన్ లో భారీ భూకంపం
  • రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత
  • ఇప్పటివరకు 48 మంది మృతి
  • జపాన్ కు తమ హృదయంలో ప్రత్యేక స్థానముందున్న రాజమౌళి
Rajamouli responds on earthquake hit Japan

నూతన సంవత్సరాది వేళ అందరూ సంబరాల్లో మునిగి ఉన్న సమయంలో జపాన్ ను భారీ భూకంపం కుదిపివేసింది. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంతో జపాన్ పశ్చిమ తీర ప్రాంత రాష్ట్రాలు వణికిపోయాయి. ఇప్పటివరకు 48 మంది మృతి చెందారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. 

కాగా, జపాన్ లో భూకంపం సంభవించడంపై దర్శకుడు రాజమౌళి స్పందించారు. జపాన్ ను తీవ్ర భూకంపం అతలాకుతలం చేసిందన్న వార్త తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. 

"మా హృదయాల్లో జపాన్ దేశానికి ప్రత్యేక స్థానం ఉంది. భూకంపం బారిన పడిన ప్రతి ఒక్కరికీ నా సానుభూతి తెలుపుకుంటున్నాను. వారు త్వరగా ఈ పరిస్థితుల నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను" అని రాజమౌళి ట్వీట్ చేశారు. 

రాజమౌళి దర్శకత్వంలో వచ్చి అంతర్జాతీయంగా సత్తా చాటిన బాహుబలి-1, బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ చిత్రాలకు జపాన్ లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. జపాన్ లో ఈ చిత్రాలు ప్రదర్శించిన థియేటర్లకు జనాలు పోటెత్తారు. ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లపై జపనీయులు ప్రత్యేక అభిమానం ప్రదర్శించారు. జపాన్ లో వారు ఎక్కడికి వెళ్లినా నీరాజనాలు పలికారు.

More Telugu News