కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను కొల్లగొట్టింది... రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది: మంత్రి పొంగులేటి
- కొన్ని రోజుల్లోనే తాము ఆరు గ్యారెంటీల అమలు దిశగా ముందుకు సాగుతున్నామన్న మంత్రి
- తెలంగాణవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రజాపాలన నడుస్తోందని వెల్లడి
- అధికారం ఉంది కదా అని కేసీఆర్ ఇష్టారీతిన అప్పులు చేశారని విమర్శలు
తమ ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తోందని... క్రమంగా అన్ని హామీలను అమలు చేస్తామన్నారు. ప్రజా సమస్యలు తీర్చేందుకే ఈ ప్రభుత్వం ఉందని చెప్పారు. గత ప్రభుత్వ హయాం లో తెలంగాణను కొల్లగొట్టారని ఆరోపించారు. గత పదేళ్లలో తెలంగాణ ఎంత మేర అప్పుల్లో కూరుకుపోయిందో ముందే ప్రజల్లో చర్చ పెట్టినట్లు తెలిపారు. అధికారం ఉంది కదా అని కేసీఆర్ ఇష్టారీతిన అప్పులు చేశారని... ప్రజల సొమ్ముతో పెద్ద ఇల్లు కట్టారని విమర్శించారు.