Jubleehills pubs: న్యూఇయర్ వేడుకల్లో నిబంధనలు అతిక్రమించిన పబ్ లపై కేసు

  • జూబ్లీహిల్స్ లో ఆరు పబ్ లపై కేసు నమోదు
  • నిర్ణీత సమయం దాటినా తెరిచే ఉంచడంతో చర్యలు
  • అధిక సౌండ్ తో ఇబ్బంది పెట్టారంటూ స్థానికుల ఫిర్యాదు
Police Case Filed On Six Pubs in Jubleehills

న్యూఇయర్ వేడుకల్లో నిబంధనలు అతిక్రమించిన ఆరు పబ్ లపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా పబ్ లను తెరిచే ఉంచారని ఆరోపించారు. దీంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దంతో పాటలు పెట్టి ఇబ్బందులకు గురిచేశారంటూ స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. జూబ్లీహిల్స్ లోని హలో, టార్, గ్రీస్ మంకీ, మకావ్, లాఫ్ట్, జీనా పబ్ లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.

కొత్త ఏడాది సందర్భంగా నిర్విహించే వేడుకలకు సంబంధించి పోలీసులు మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 31న రాత్రి 1 గంట వరకు తెరిచి ఉంచేందుకు పబ్ లు, క్లబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్ లు, వైన్స్ లకు అనుమతించారు. ఆ తర్వాత కూడా తెరిచి ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆదేశాలను పెడచెవిన పెట్టి నిర్ణీత సమయం దాటినా క్లోజ్ చేయని ఆరు పబ్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

More Telugu News