తెలంగాణలో పెరుగుతున్న కోడి గుడ్లు, మాంసం ధరలు
- కార్తీకమాసం ముగియడంతో పెరిగిన వినియోగం
- కోడి గుడ్డు ధర రూ 5.50 నుంచి రూ.7కు పెరిగిన వైనం
- కిలో చికెన్ ధర రూ.170 నుంచి రూ.240కి చేరిక
- చలికాలం కారణంగా గుడ్ల ఉత్పత్తి తగ్గడంతో పెరుగుతున్న ధరలు
తెలంగాణలో మొత్తం 1100 కోళ్ల ఫారాలు ఉన్నాయి. ఏటా 17.67 బిలియన్ గుడ్ల ఉత్పత్తితో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉంది. కానీ, చలికాలం కారణంగా కోళ్ల ఆరోగ్యంపై ప్రభావం పడి ఉత్పత్తి తగ్గిందని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు, దాణా చార్జీలు, రవాణా చార్జీల పెరిగాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. క్వింటాలు సోయాచెక్క దాణా ధర గతేడాది రూ.5 వేలు ఉండగా ప్రస్తుతం రూ.7200 వేలకు పెరిగింది. రాష్ట్రంలో సగటున రోజుకు 80 లక్షల కోడిగుడ్ల విక్రయాలు జరుగుతాయి. కానీ కరోనా భయాల నేపథ్యంలో వారం రోజులుగా ఈ సంఖ్య కోటి దాటిందని పౌల్ట్రీ వర్గాలు చెప్పాయి.