KTR: పారిశుద్ధ్య కార్మికులతో కలిసి భోజనం చేసిన కేటీఆర్

  • తెలంగాణ భవన్‌లో నూతన సంవత్సర వేడుకలు
  • పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించిన కేటీఆర్
  • కార్మికులతో కలిసి సెల్ఫీలు దిగిన మాజీ మంత్రి
KTR takes lunch with sanitary workers

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి భోజనం చేశారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆయన తెలంగాణ భవన్‌లో వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారితో కాసేపు ముచ్చటించి... ఆ తర్వాత క‌లిసి భోజ‌నం చేశారు. కార్మికుల‌తో సెల్ఫీలు దిగారు. ఈ కార్య‌క్ర‌మంలో జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉండగా... కేటీఆర్‌ను ప‌లువురు బీఆర్ఎస్ ప్రజాప్ర‌తినిధులు, నేత‌లు, కార్య‌క‌ర్త‌లు క‌లిసి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు.

More Telugu News