K Raghavendra Rao: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ ఎలా చెప్పారో చూడండి!

  • నేడు నూతన సంవత్సరాది
  • అందరికీ శుభాకాంక్షలు తెలిపిన దర్శకేంద్రుడు
  • టేబుల్ నిండా కమలా ఫలాలతో దర్శనమిచ్చిన రాఘవేంద్రరావు
Director K Raghavendra Rao wishes all on new year eve

టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తన సినిమాల్లో పాటలను ఎంత రమణీయంగా చిత్రీకరిస్తారో తెలిసిందే. పూలు, పండ్లను ఉపయోగించుకుంటూ కథానాయిక అందాలను ఓ రేంజిలో చూపించడం రాఘవేంద్రరావుకే సాధ్యం అనేలా ఆ పాటలు ఉంటాయి. 

ఇవాళ నూతన సంవత్సరాది నేపథ్యంలోనూ దర్శకేంద్రుడు తన ట్రేడ్ మార్కును ప్రదర్శించారు. తన కార్యాలయంలో టేబుల్ ను కమలాఫలాలతో నింపేశారు. ఈ కొత్త ఏడాది అందరికీ 'ఫల'ప్రదం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు... అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ... మీ రాఘవేంద్రరావు అంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఎక్స్ లో వీడియోను పంచుకున్నారు.

More Telugu News