Narendra Modi: కేంద్రంలో మూడోసారీ మోదీనే.. యూకే పత్రికలో కథనం

PM Modis third straight term at Centre almost an inevitability declares column in leading UK daily
  • ది గార్డియన్ పత్రికలో యూకే కాలమిస్ట్ హానా ఎల్లిస్ పీటర్స్ కథనం
  • ఇటీవలి ఎన్నికల్లో విజయాలు, మోదీ పాప్యులారిటీ, రామమందిరంతో మెరుగైన విజయావకాశాలు
  • జాతీయస్థాయిలో ప్రతిపక్షం బలహీనంగా ఉందన్న హానా
‘మూడు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం..మోదీ అసాధారణ పాప్యులారిటీ..రామమందిర ప్రారంభోత్సవం.. వెరసి ప్రధాని సారథ్యంలో బీజేపీ మూడోసారి కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవడం తథ్యం’ అని యూకే కాలమిస్ట్ హానా ఎల్లిస్ పీటర్స్ స్పష్టం చేశారు. ఈ మేరకు ది గార్డియన్ దినపత్రిలో తన కాలమ్‌లో అభిప్రాయపడ్డారు. 

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలు బీజేపీ బలాన్ని మరింత పెంచాయని హానా ఎల్లిస్ పీటర్స్ అభిప్రాయపడ్డారు. ఈ విజయాల అనంతరం ప్రధాని స్పందిస్తూ హ్యాట్రిక్ పక్కా అని పేర్కొనడాన్ని కూడా హానా ఎల్లిస్ తన కాలమ్‌లో ప్రస్తావించారు. ప్రస్తుతం దేశంలో రాజకీయ వాతావరణాన్ని బట్టి మోదీకి విజయావకాశాలు ఎక్కువని దేశంలో అధికశాతం పరిశీలకులు అభిప్రాయపడుతున్నట్టు తేల్చారు. 

‘‘రాజకీయ ఉద్దండుడిగా ప్రధాని మోదీ పాప్యులారిటీ తోపాటూ బీజేపీ హిందూ జాతీయ వాద ఎజెండా..హిందువులను ఆకట్టుకుంటున్నాయి. 2014 తరువాత రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో  పరిస్థితులు మోదీకి అనుకూలంగా మారాయి’’ అని హానా పేర్కొన్నారు. 

దక్షిణ, తూర్పు భారతంలో బీజేపీ ప్రత్యర్థులు కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో బలహీనంగా ఉందని చెప్పారు. కేవలం మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయన్న అభిప్రాయం నెలకొందని చెప్పారు. అంతేకాకుండా, బీజేపీ ప్రతిపక్షాల జాతీయ స్థాయి కూటమి ‘ఇండియా’లో కీలక అంశాల్లో ఏకాభిప్రాయం రావాల్సి ఉందని కూడా పేర్కొన్నారు. ఇప్పటికే బీజేపీ ఎన్నికల కదనరంగంలోకి దిగిందని, వికసిత భారత సంకల్ప యాత్ర ఇందులో భాగమేనని పేర్కొన్నారు. బీజేపీ విజయాల గురించి గ్రామల వరకూ చేర్చాలని అధికారులకు బాధ్యతలు అప్పగించినట్టు చెప్పారు. మోదీ పాప్యులారిటీ, సంక్షేమ పథకాలు, హిందుత్వ ఎజెండాతో బీజేపీ వ్యూహాత్మకంగా వెళుతోందని అన్నారు.
Narendra Modi
BJP
Congress

More Telugu News