Basmati Rice: విదేశీయులతోనూ లొట్టలేయిస్తున్న మన బాస్మతి

  • బిర్యానీ స్పెషల్ గా బాస్మతి బియ్యానికి విపరీతమైన క్రేజ్
  • ప్రత్యేకమైన పరిమళంతో, పొడవుగా ఉండే బియ్యం
  • భారత్ నుంచి విదేశాలకు పెరిగిన బాస్మతి బియ్యం ఎగుమతులు
  • ఈ ఏడాది నవంబరు వరకు 300 కోట్ల డాలర్ల మేర ఎగుమతి
Huge demand for Basmati rice world wide

బాస్మతి బియ్యంతో చేసిన దమ్ బిర్యానీ రుచి చూస్తే ఎవరైనా వాహ్ అనాల్సిందే. ఒక్కొక్క గింజ అంగుళం పొడవున ఉండే ఈ బాస్మతి తన పరిమళంతో బిర్యానీకి సిసలైన ఫ్లేవర్ అందిస్తుంది. భారత్ లో అధికంగా పండే బాస్మతి బియ్యం ప్రపంచ దేశాలకు కూడా ఎగుమతి అవుతోంది. 

ఇటీవల కాలంలో విదేశాల నుంచి బాస్మతి బియ్యం కోసం విపరీతమైన గిరాకీ ఏర్పడిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బాస్మతి బియ్యం ప్రొక్యూర్ మెంట్ కూడా 15 శాతం పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. మన బాస్మతి బియ్యం రుచికి ప్రపంచ దేశాలు ఏ రేంజ్ లో ఫిదా అయ్యాయో దీన్ని బట్టే చెప్పవచ్చు. 

ఇప్పటికే బాస్మతి బియ్యం ధర 30 శాతం పెరగ్గా, అది తర్వాతి సీజన్ కు కూడా కొనసాగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. 

భారత్ నుంచి అధికంగా బాస్మతి బియ్యాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో మధ్య ప్రాచ్య దేశాలు, గల్ఫ్ దేశాలు, యూరప్ దేశాలు, అమెరికా ముందు వరుసలో నిలుస్తాయి. 2023లో చూస్తే... ఈ నవంబరు వరకు 300 కోట్ల డాలర్ల విలువైన బాస్మతి బియ్యం ఎగుమతులు జరిగాయి. 2024లో ఈ ఎగుమతులు మరింత పెరగనున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

More Telugu News