New Year Celebrations: నూతన సంవత్సర వేడుకలు.. విదేశాల్లో తెలుగు సినీ స్టార్ల సెలబ్రేషన్స్!

Telugu cine stars new year celebrations in foreign countries
  • దుబాయ్‌లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోనున్న మహేశ్ బాబు, అల్లుఅర్జున్
  • అమెరికాలో విజయ్ దేవరకొండ సందడి
  • జపాన్‌లో ఎన్టీఆర్ న్యూ ఇయర్ వేడుకలు
  • ఈమారు స్వదేశంలోనే నూతన సంవత్సరానికి స్వాగతం పలకనున్న రామ్ చరణ్
యావత్ ప్రపంచం కొత్త సంవత్సరం వేడుకల మూడ్‌లోకి వచ్చేసింది. ఇక మన సెలబ్రిటీల విషయం అయితే చెప్పనక్కర్లేదు. ఇప్పటికే అనేక మంది న్యూ ఇయర్ వేడుకల కోసం విదేశాలకు వెళ్లిపోయారు.

తరచూ విదేశాలకు వెళ్లివచ్చే సూపర్ స్టార్ మహేశ్ బాబు న్యూ ఇయర్ వేడుకలను దుబాయ్‌లో జరుపుకుంటున్నారు. గుంటూరు కారం షూట్ పూర్తవడంతో ఆయన కుటుంబంతో సహా దుబాయ్‌కు వెళ్లారు. పనిలో పనిగా అక్కడ ఓ యాడ్ షూటింగ్‌ కి కూడా ప్లాన్ చేశారట.

జపాన్‌లో న్యూ ఇయర్ వేడుకలు ప్లాన్ చేసిన తారక్ ప్రస్తుతం అక్కడే ఉన్నారు. తారక్‌కు జపాన్ అభిమానులు స్వాగతం పలికిన వీడియోలు కూడా వైరల్‌గా మారాయి. 

అల్లు అర్జున్ కూడా తన భార్యాపిల్లలతో దుబాయ్‌లో ఉన్నారు. అక్కడే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోనున్నారు. నాలుగైదు రోజుల ముందు నుంచే అక్కడ వారి హడావుడి మొదలైనట్టు తెలుస్తోంది. 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకుంటారన్న దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. రామ్ చరణ్ ఇంకా ముంబైలోనే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈసారి చరణ్ కొత్త సంవత్సరం వేడుకలు ఇక్కడే జరుపుకుంటారని సమాచారం

పరుశురామ్ డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్న రౌడీ హీరో విజయ దేవరకొండ ప్రస్తుతం షూటింగ్ కోసం అమెరికాలోనే ఉన్నారు. దీంతో అక్కడే ఇయర్ వేడుకలకు ప్లాన్ చేశాడని తెలిసింది. 

ఈ ఏడాది కూడా విశాల్ నూతన సంవత్సర వేడుకల కోసం కుటుంబంతో సహా అమెరికా వెళ్లాడు. అక్కడే ఓ ప్రాంక్ వీడియో చేసి నెట్టింట హడావుడి సృష్టించాడు. ఇదిలా ఉంటే, బాలీవుడ్ స్టార్లు, డైరెక్టర్లు కూడా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు విదేశాలకు వెళ్లిపోయారు.
New Year Celebrations
Mahesh Babu
Allu Arjun
Ramcharan
Jr NTR

More Telugu News