Ramcharan: రామ్‌చరణ్‌తో సినిమాపై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడి క్లారిటీ

  • రాజ్‌కుమార్ హిరానీతో రామ్ చరణ్ సినిమా ఉందంటూ వార్తలు వైరల్
  • ఈ కథనాలపై తాజాగా ఇంటర్వ్యూలో బాలీవుడ్ దర్శకుడి క్లారిటీ
  • ప్రస్తుతానికి చరణ్‌తో ఎలాంటి సినిమా లేదని స్పష్టం చేసిన దర్శకుడు
Rajkumar hirani says he is planning no movie with Ram charan at present

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం సెన్సేషనల్ దర్శకుడు శంకర్‌తో ఓ భారీ పాన్ఇండియా మూవీ చేస్తున్నాడు. ఆ తరువాత మరో సినిమా కూడా రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీతో కలిసి రామ్‌చరణ్ ఓ సినిమా చేయబోతున్నట్టు ఈ మధ్య వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

ఈ విషయమై రాజ్‌కుమార్ హిరానీ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ఓ ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రామ్ చరణ్‌తో ప్రస్తుతానికి ఏ సినిమా ప్లాన్ చేయట్లేదని స్పష్టం చేశారు. అయితే, రామ్‌చరణ్ తనకు తెలుసునని, అవకాశాన్ని బట్టి చరణ్‌తో సినిమా చేస్తానని తెలిపారు. ఆర్ఆర్ఆర్‌లో రామ్‌చరణ్ అద్భుతంగా చేశాడని కూడా కితాబునిచ్చారు.

More Telugu News