PSLV-C58: కొత్త సంవత్సరం తొలి రోజునే ఇస్రో ప్రయోగం

  • సోమవారం ఉదయం 9.10 గంటలకు పీఎస్ఎల్‌వీ సీ58 ప్రయోగం
  • ఈ ప్రయోగంలో ఎక్స్‌పోశాట్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్న ఇస్రో
  • ఆదివారం ఉదయం 8.10 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం
  • శ్రీహరికోటలోని షార్ సెంటర్‌లో ప్రయోగం
ISRO to conduct pslv c58 launch on monday

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ముఖ్య ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా స్వదేశీ ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది. సోమవారం ఉదయం 9.10 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఈ దిశగా శనివారం ప్రయోగ సన్నద్ధతపై లాంచ్ ఆథరైజేషన్ సమావేశాలు జరిగాయి. 

ఆదివారం ఉదయం 8.10 గంటలకు ప్రారంభయ్యే కౌంట్ డౌన్ సోమవారం రాకెట్ ప్రయోగంతో ముగుస్తుంది. మునుపటి పరిశోధనలకు భిన్నంగా ఈమారు ఎక్స్-రే‌తో ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ విశ్వరహస్యాలను ఛేదించడం ఈ మిషన్ లక్ష్యం. ఎక్స్‌పోశాట్ జీవితకాలం ఐదేళ్లు. ఈమారు ఎక్స్‌పోశాట్ ఉపగ్రహంతో పాటూ మరో పది ఇతర పేలోడ్‌లను అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు.

More Telugu News