Massive Fire accident: మహారాష్ట్ర గ్లోవ్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం...ఆరుగురు కార్మికుల మృతి

6 Workers Trapped After Massive Fire In Maharashtra Glove Factory
  • ఫ్యాక్టరీలో చిక్కుకున్న కార్మికులు
  • హాహా కారాలు చేసిన కార్మికులు
  • అదుపులోకి రాని మంటలు
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వాలూజ్ ఎంఐడీసీ ప్రాంతంలో ఉన్న హ్యాండ్ గ్లోవ్స్ తయారీ కంపెనీలో తెల్లవారుజామున 2.15 గంటలకు జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు కార్మికులు చిక్కుకుపోయారు. భవనంలో చిక్కుకున్న తమ బంధువులను రక్షించేందుకు సహాయం కోసం ప్రజలు హాహాకారాలు చేస్తున్నట్లు ఆ ప్రాంతం నుంచి దృశ్యాలు చూపించాయి. ఈ అగ్నిప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవ దహనమయ్యారని ఫైర్ ఆఫీసర్ మోహన్ ముంగ్సే చెప్పారు. 

రాత్రి కంపెనీ మూసి ఉందని, కంపెనీలో మంటలు చెలరేగాయని కార్మికులు చెప్పారు. మృతులను ఇంకా గుర్తించాల్సి ఉందని పోలీసులు చెప్పారు. మంటలు చెలరేగినప్పుడు భవనం లోపల 10-15 మంది ఉన్నారని, కొందరు తప్పించుకోగలిగారు. మరికొందరు ఇంకా లోపల అగ్నిప్రమాదంలో చిక్కుకున్నారని  కార్మికులు తెలిపారు. 

అగ్నిమాపక యంత్రాలు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కంపెనీలో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. అగ్నిప్రమాదాన్ని చూసేందుకు సంఘటన స్థలానికి పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అగ్నిమాపకశాఖ అధికారులు చెప్పారు.
Massive Fire accident
Maharashtra
Glove Factory
Workers trapped

More Telugu News