Harish Rao: మెట్రో రైలులో ప్రయాణించిన మాజీ మంత్రి హరీశ్ రావు

Former Minister Harish Rao travelled in Metro
  • నాగోల్ శిల్పారామంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్ రావు
  • రవీంద్రభారతిలో మరో కార్యక్రమం కోసం ఎల్బీనగర్ వద్ద మెట్రో ఎక్కిన మాజీ మంత్రి
  • ప్రయాణికులతో సరదాగా మాట్లాడుకుంటూ ప్రయాణించిన హరీశ్ రావు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు మెట్రో రైలు ఎక్కారు. రవీంద్రభారతికి వెళ్ళేందుకు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్‌లో రైలు ఎక్కి.. లక్డీకాపూల్ స్టేషన్‌లో దిగారు. రైలులో ప్రయాణికులతో సరదాగా ముచ్చటిస్తూ ప్రయాణించారు. హరీశ్ రావు నాగోల్‌ శిల్పారామంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత రవీంద్రభారతిలో మరో కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన ఎల్బీ నగర్‌లో మెట్రో ఎక్కారు. రవీంద్రభారతిలో నిర్వహించే అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ కార్యక్రమానికి రావడం ఆలస్యమవుతుందని మెట్రోలో ప్రయాణించారు. కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మెట్రోలో ప్రయాణించి ప్రయాణికులను ఆశ్చర్యానికి గురి చేశారు.
Harish Rao
metro rail
Telangana
BRS

More Telugu News