Devil: వరల్డ్ వైడ్ గా 'డెవిల్' ఫస్టు డే వసూళ్లు .. సీక్వెల్ ఖాయమే!

  • భారీస్థాయిలో నిన్ననే విడుదలైన 'డెవిల్'
  • ప్రపంచవ్యాప్తంగా డే 1 వసూళ్లు 4.92 కోట్లు 
  • వీకెండులో మరింతగా పెరగనున్న వసూళ్లు 
  • సీక్వెల్ ఉంటుందని చెప్పిన కల్యాణ్ రామ్ 

Devil movie update

మొదటి నుంచి కూడా కల్యాణ్ రామ్ వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలు మరింత భారీతనాన్ని పెంచుకోవడం కనిపిస్తుంది. అలా నిన్న థియేటర్లకు వచ్చిన సినిమానే 'డెవిల్'. కల్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ నటించిన ఈ సినిమాను అభిషేక్ నామా రూపొందించగా, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందించాడు. 

తొలి రోజునే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 4.92 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. రేపు .. ఎల్లుండి కూడా సెలవు దినాలు కావడంతో, వసూళ్లు మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. నిర్మాణ విలువల పరంగా .. కంటెంట్ పరంగా ఈ సినిమా మంచి మార్కులను కొట్టేసింది. 

1945 కాలంలో ఈ కథ నడుస్తుంది. కథ మొదలైన దగ్గర నుంచి అనేక మలుపులు తీసుకుంటూ ముందుకు వెళుతుంది. టేకింగ్ పరంగా ఈ సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. ఈ కారణంగానే ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని కల్యాణ్ రామ్ చెప్పాడు. ఈ ఏడాదిలోనే ఈ సీక్వెల్ కి సంబంధించిన పనులు మొదలవుతాయని అన్నాడు. 'బింబిసార' సీక్వెల్ తరువాత ఆయన చేసే మరో సీక్వెల్ ఇదే అవుతుందన్న మాట.

More Telugu News